: చరణ్ చిలిపి కుర్రాడు: నదియా
రామ్ చరణ్ చిలిపి కుర్రాడని నటి నదియా నవ్వుతూ చెప్పింది. హైదరాబాదులోని నోవాటెల్ లో జరిగిన 'బ్రూస్ లీ ద ఫైటర్' సినిమా ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, తొలి రోజు షూటింగ్ లో పెద్ద డైలాగులు ఇచ్చారని, 'దేవుడా, ఇంత పెద్ద డైలాగులా?' అంటూ భయపడ్డానని, అయితే దర్శకుడు శ్రీను వైట్ల సాయం చేశారని చెప్పింది. రామ్ చరణ్ తో షూటింగ్ లో తొలి రోజు పెద్దగా మాట్లాడలేదని, దాంతో అతను రిజర్వుడ్ టైపు అని ఊరుకున్నానని నదియా తెలిపింది. తరువాత షూటింగ్ గడుస్తున్న కొద్దీ చరణ్ లోని చిలిపి యాంగిల్ బయటపడిందని, రామ్ చరణ్ చాలా అల్లరి పిల్లాడని తెలిపింది.