: ప్రపంచంలోని ఏ జట్టుకైనా యువజట్టు సమాధానం చెప్పగలదు: రవిశాస్త్రి
భారత యువ జట్టుపై టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశాడు. యువకులతో కూడిన భారత జట్టు అత్యద్భుతంగా ఉందని పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం తరువాత సౌతాఫ్రికా వంటి పెద్ద జట్టు భారత్ లో పర్యటిస్తోందని, రెండు నెలలపాటు సౌతాఫ్రికా భారత్ లోనే ఉంటుందని ఆయన తెలిపాడు. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. యువకులతో కూడిన భారత జట్టు ప్రపంచంలోని ఏ జట్టుకైనా సమాధానం చెప్పగలదని ఆయన ధీమాగా చెప్పాడు.