: ఇంద్రాణీ ముఖర్జీకి అస్వస్థత
షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీ అస్వస్థతకు గురయ్యారు. జుడీషియల్ కస్టడీలో ఉన్న ఇంద్రాణీకి శుక్రవారం ఛాతీనొప్పి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను ముంబయిలోని ఒక ఆసుపత్రికి తరలించారు. కాగా, 2012 లో షీనాబోరా అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఆర్థిక కారణాలతో తల్లి ఇంద్రాణీ ముఖర్జీయే తన కూతురిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.