: నారాయణ కళాశాల విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నం... కడప రిమ్స్ కు తరలింపు


రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్న నారాయణ కళాశాల విద్యార్థిని మనీషా(16) తల్లి ఇవాళ ఆత్మహత్యాయత్నం చేసింది. తమకు న్యాయం జరగలేదంటూ నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పినప్పటికీ ఆమె పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని సమాచారం. కడప శివారులోని నారాయణ జూనియర్ బాలికల కళాశాల హాస్టల్ లో ఆగస్టు 17న ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మనీషా, నందిని అనే విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కళాశాల యాజమాన్యం ఒత్తిడి కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News