: కేసీఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయమై ఆలోచిస్తున్నాం: భట్టి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజాసమస్యలపై ఎన్ని రోజులైనా అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ అంటారని... అంతలోనే సభను వాయిదా వేసి పారిపోతారని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీని ఒకే దఫాలో చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై విపక్షాలన్నింటితో కలసి ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు. ఒక్కదఫాలోనే రైతు రుణమాఫీ చేయాలని ప్రతిపక్షాలన్నీ పోరాడుతున్నాయని చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కేసీఆర్ సర్కార్ పై అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందా అని తమ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారని చెప్పారు.