: సొంత రియాలిటీ షో ప్లాన్ చేస్తున్న సల్మాన్ ఖాన్


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ త్వరలో సొంత ప్రొడక్షన్ లో రియాలిటీ షో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ఇప్పటికే సల్లూ చేస్తున్న'బిగ్ బాస్' రియాలిటీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ షోలో సెలబ్రిటీలు ఓ ఇంట్లో ఉండి మాట్లాడుకోవడం, ఎవరి పనులు వారు చేసుకోవడం, అప్పుడప్పుడు గిల్లికజ్జాలు పెట్టుకోవడం జరుగుతుంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా సల్మాన్ షో ఉంటుందట. స్వతహాగా వ్యవసాయం అంటే ఇష్టపడే సల్మాన్... ఆ తరహాలోనే షో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. దానికి టైటిల్ 'ద ఫార్మ్' అని పెడుతున్నారు. అంటే పూర్తి విలేజ్ సెటప్ లో ఈ షో ఉండనుంది. ఇందులో పాల్గొనే సెలబ్రిటీలకు వ్యవసాయం చేయడం గురించి ముందుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ తీసుకున్న వారికే షోలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే షోలో వినోదం పాలు కాస్త ఎక్కువ ఉండేలా స్క్రిప్టులో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలర్స్ హిందీ ఛానల్ లోనే ఇది ప్రసారమయ్యే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News