: గాంధీ భవన్ లో రణరంగం...మాజీ ఎంపీ బలరాం నాయక్ ను తోసేసిన గిరిజన నేత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పార్టీకి చెందిన గిరిజన నేతల మధ్య వాగ్వాదంతో పాటు ఒకరినొకరు తోసేసుకున్నారు. మాజీ ఎంపీ బలరాం నాయక్, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్ లాల్ నాయక్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఆ తర్వాత కాలర్లు పట్టుకునే దాకా వెళ్లింది. పార్టీ వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారంటూ జగన్ లాల్, బలరాం నాయక్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఇరువురు నేతలు పెద్దగా కేకలేస్తూ వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో తనను తోసేసేందుకు యత్నించిన జగన్ లాల్ ను బలరాం నాయక్ కూడా తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన పార్టీ నేతలు కల్పించుకుని ఇరువురు నేతలకు సర్ది చెప్పారు.