: గాలి జనార్దన్ రెడ్డి మరోసారి అరెస్ట్?... ఆదేశాలు జారీ చేసిన కర్ణాటక లోకాయుక్త
ఓఎంసీ కేసులో ఇప్పటికే సుదీర్ఘ కాలంగా జైల్లో గడిపి వచ్చిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మరోమారు అరెస్ట్ కానున్నారు. ఆయన అరెస్ట్ కోసం కర్ణాటక లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాల కాపీలతో బయలుదేరిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పోలీసులు జనార్దన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇనుప ఖనిజం అక్రమ రవాణాకు సంబంధించి ఇటీవలే సిట్ అధికారులు బళ్లారిలోని జనార్దన్ రెడ్డి ఇంటిపై దాడులు చేశారు. ఆ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బెళికిరి పోర్టు నుంచి జనార్దన్ రెడ్డి 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారని సదరు పత్రాల ద్వారా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన అరెస్ట్ కోసం ఆదేశాలివ్వాలని లోకాయుక్తను కోరారు. సిట్ అధికారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన లోకాయుక్త అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది.