: బీహార్ లో నేడు తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న మోదీ


మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ఆయన బీహార్ వెళుతున్నారు. ఎన్నికల ప్రకటన తర్వాత తొలిసారి బీహార్ లో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ బీహార్ రావడం ఇది ఐదవసారి. ఈ నెల 12న తొలిదశ ఎన్నికలు జరిగే బంకా జిల్లాలో ప్రధాని నేడు ప్రసంగించనున్నారు. బీహార్ లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ... నిన్ననే ఈ రాష్ట్రానికి విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించింది. అధికారంలోకి వస్తే పేదరిక నిర్మూలన, అభివృద్ధే లక్ష్యమని పేర్కొంది.

  • Loading...

More Telugu News