: ఐపీఎల్ రికార్డు బ్రేక్ చేసిన గేల్
కరీబియన్ రన్ మెషీన్ క్రిస్ గేల్ ధాటికి ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బద్దలైంది. ఇంతకుముందు యూసుఫ్ పఠాన్ పేరిట ఉన్న 37 బంతుల్లో సెంచరీ రికార్డును గేల్ నేడు తిరగరాశాడు. పుణే వారియర్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ ఓపెనర్ గేల్ కేవలం 30 బంతుల్లోనే 'శత'క్కొట్టాడు. క్రికెట్ లో ఏ ఫార్మాట్లో చూసినా ఇదే వేగవంతమైన శతకం. ప్రస్తుతం గేల్ 103 పరుగులతో ఆడుతుండగా.. బెంగళూరు 9.3 ఓవర్లలో 127 పరుగులు చేసింది. మరో ఓపెనర్ దిల్షాన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నాడు.