: బీహార్ లో భారీగా అమెరికన్ కరెన్సీ పట్టివేత


బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇవాళ తనిఖీల్లో మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో దాని విలువ సుమారు ఆరున్నర కోట్లు ఉంటుందంటున్నారు. పాట్నాకు 280 కిలోమీటర్ల దూరంలోని మాధేపురాలో బైకులపై వెళుతున్న ఇద్దరు వ్యక్తుల బ్యాగులను పోలీసులు సోదా చేశారు. వీరి వద్ద ఈ విదేశీ నగదు కనిపించింది. దానిపై వారిని ప్రశ్నించగా... అదొక చిట్ ఫండ్ కంపెనీ వారిదని, దేశీయ కరెన్సీలోకి మార్చేందుకు తీసుకెళుతున్నట్టు చెప్పారు. దానిపై విచారణ జరుపుతామని మాధేపురా ఎస్పీ కుమార్ ఆశిష్ తెలిపారు. ఇంతవరకు పట్టుబడిన ఎన్నికల నగదులో ఇదే పెద్ద మొత్తమన్నారు.

  • Loading...

More Telugu News