: మోదీని గాంధీతో పోల్చి వివాదం రేపిన బీజేపీ నేత
ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానం చూపడంలో బీజేపీ నేతల శైలే వేరు. ఎన్నికల సందర్భంగా భారత దేశాన్ని కాపాడడానికి వచ్చిన యుగపురుషుడు అంటూ కొందరు వ్యాఖ్యానించి ఆయన వద్ద మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నించగా, తాజాగా ఢిల్లీకి చెందిన బీజేపీ నేత విజయ్ గోయల్ ప్రధానిని గాంధీతో పోల్చి వివాదం రేపారు. ప్రధాని అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసి స్వదేశం వచ్చిన సందర్భంగా ఢిల్లీ నేత విజయ్ గోయల్ తన నివాసం వద్ద గాంధీ, మోదీల ఫోటోలతో 'సబర్మతి నుంచి వచ్చి దేశ చరిత్రను మలుపు తిప్పార'నే వ్యాఖ్యతో కూడిన ఫ్లెక్సీ పెట్టారు. ఇదిప్పుడు వివాదం రేపుతోంది. మోదీని గాంధీతో పోల్చడమేంటని పలువురు మండిపడుతున్నారు. ఇద్దరూ సబర్మతి తీరం నుంచి వచ్చారని చెప్పడం తప్పా? అంటూ విజయ్ గోయల్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కాగా, గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్ నుంచి వచ్చినవారు కావడం విశేషం!