: 'టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్'లో ఏయూకు 11వ ర్యాంక్
ఏపీలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం అరుదైన ఘనత సాధించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో దేశంలోనే 11వ ర్యాంకు దక్కించుకుంది. దేశంలోని 19 ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యాసంస్థలలో ఏయూకు ఈ ర్యాంక్ దక్కింది. అంతకుముందు బోధన, అంతర్జాతీయ దృక్పథం, పారిశ్రామిక ఆదాయ విభాగాల్లో తమ అర్హతలు, గణాంకాలను సమర్పించింది. అతి తక్కువ సమయంలో వర్సిటీ పరిశోధనా, సిద్ధాంత గ్రంధాలను అంతర్జాలంలో చూసేందుకు వీలుకల్పించిన నేపథ్యంలోనే వర్సిటీకి పదకొండవ ర్యాంక్ లభించింది. ఈ ర్యాంకింగ్స్ లో మిగిలిన టాప్ టెన్ వర్సిటీలన్నీ సెంట్రల్ వర్సిటీలు కావడం గమనార్హం. ఏపీ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సహకారంతో వచ్చే ఐదు సంవత్సరాల్లో వర్సిటీని ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల సరసన నిలబెట్టాలన్నదే ఈ మిషన్ ధ్యేయమని అధికారులు అంటున్నారు.