: ఢిల్లీలోని ఏపీ భవన్ లో కాల్పుల కలకలం
ఢిల్లీలోని ఏపీ భవన్ లో తుపాకీ మోత కలకలం రేపింది. రూమ్ నెంబర్ 404 నుంచి కాల్పుల శబ్దం రావడంతో, ఒక్కసారిగా అంతా అలర్ట్ అయ్యారు. అయితే, కేవలం మిస్ ఫైర్ కావడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గదిలో దిగిన వ్యక్తుల వద్ద ఉన్న గన్ కు లైసెన్స్ ఉందా? లేదా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. గంట క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది.