: అమిత్ షా ఓ నరహంతకుడు: లాలూప్రసాద్ యాదవ్


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. గుజరాత్ అల్లర్లలో ప్రధాన భూమిక వహించింది అమిత్ షానే అని ఆరోపించారు. హత్యలతో ఆయన నరహంతకుడిగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఎద్దేవా చేశారు. నరభక్షకుడైన అమిత్ షా ఇప్పుడు బీహార్ లో ఎందుకు తిరుగుతున్నారు? బీహార్ లో ఆయనకు ఏం పని? అని లాలూ ప్రశ్నించారు. గుజరాత్ అల్లర్ల సమయంలో అమిత్ షా ఎన్నిసార్లు అరెస్టయ్యారో తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు బీహర్ లో కూడా అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News