: ఏపీ ప్రభుత్వం-పెట్రోల్ బంక్ యజమానుల మధ్య చర్చలు విఫలం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లంతో ఏపీ పెట్రోల్ బంకుల యజమానులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పెట్రోల్, డీజిల్ పై రూ. 4 వ్యాట్ తగ్గించాల్సిందే అని బంకు యజమానులు పట్టుబట్టారు. దీంతో, ఈ విషయాన్ని ప్రభుత్వంతో మాట్లాడి, అభిప్రాయాన్ని తెలియజేస్తామని అజయ్ కల్లం తెలిపారు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విదేశీ పర్యటనలో ఉన్నందున పది రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరింది. ఈ సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పెట్రోల్ బంక్ యజమానుల సంఘం నేతలు భేటీ కానున్నారు. మరోవైపు, ఏపీ వ్యాప్తంగా చేపట్టిన పెట్రోల్ బంక్ ల బంద్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News