: చైనాకు భారీ నష్టాన్ని కలిగించిన 'దుజువాన్'!
చైనా తీర ప్రాంత పట్టణాలైన జిజియాంగ్, ఫుజియాన్ లపై విరుచుకుపడ్డ సూపర్ టైఫూన్ 'దుజువాన్' కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించింది. చైనాను ఈ ఏడు 21 తుపానులు తాకగా, అన్నింటిలోకీ ఇదే అతిపెద్దది. ఈ తుపాను తాకిడికి 324 మంది గాయపడ్డారని, ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. మొత్తం 4.30 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 2.4 బిలియన్ యువాన్ల ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. 400కు పైగా నివాస గృహాలు నేలమట్టం కాగా, 31 వేల హెక్టార్లలో పంట నీటిపాలైందని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వరదలు అధికంగా ఉండటంతో సహాయక చర్యలు వేగవంతం కాలేదని వివరించారు.