: జార్జియా రాష్ట్రంలో 70 ఏళ్ల తరువాత మహిళకు మరణదండన అమలు
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జస్సెండనర్ అనే 47 ఏళ్ల మహిళకు మరణశిక్ష అమలు చేశారు. 70 సంవత్సరాల తరువాత జార్జియాలో ఓ మహిళకు మరణదండన అమలు చేయడం ఇదే తొలిసారని స్థానిక మీడియా చెబుతోంది. జాక్సన్ నగరంలోని డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ కారాగారంలో ఆమెకు విషపు ఇంజక్షన్ చేసి మరణశిక్ష అమలు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. భర్త డాగ్లస్ ను కెల్లీ 1997లో హత్య చేసిన కేసులోనే ఈ శిక్ష పడింది. ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు న్యాయవాదులు పలు ప్రయత్నాలు చేసినా, పోప్ లేఖ రాసినా ఫలితం లేకపోయింది. మృత్యువు ఒడిలోకి వెళ్లేముందు, చివరిగా కెల్లి పశ్చాత్తాపం పడిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ కూడా చెప్పిందన్నారు.