: నితీశ్ కు మద్దతు ప్రకటించిన కేజ్రీ... ఓటు వేయాలని విజ్ఞప్తి
బీహార్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న సీఎం నితీశ్ కుమార్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. నితీశ్ కు ఓటు వేయాలని బీహార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే తన ప్రకటనను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్నారు. తన పూర్తి మద్దతు నితీశ్ కే ప్రకటిస్తున్నానని చెప్పారు. ఆయన చాలా మంచి మనిషంటూ ట్విట్టర్ లో కేజ్రీ పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోదని, ఎన్నికల ప్రచారానికి వెళ్లనని కేజ్రీ అన్నట్లు మీడియాలో నిన్న (బుధవారం) వార్తలు వచ్చాయి. ఇందుకు స్పందించిన ఢిల్లీ సీఎం పైవిధంగా వివరణ ఇచ్చారు.