: విజయవాడలో ఏపీ మంత్రివర్గ భేటీ ప్రారంభం
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ మంత్రివర్గం భేటీ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు ప్రధాన అంశంగా మంత్రివర్గం చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగలుకు 2.3 శాతం డీఏ పెంపునకు ఆమోదం, వారి పిల్లల స్థానికత అంశంపైన ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపైనా మంత్రులు చర్చించే అవకాశం ఉంది.