: తెచ్చింది మేమైతే, మీరు చంకలు గుద్దుకుంటున్నారు: రఘువీరా ఎద్దేవా


అనంతపురం జిల్లాకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను తీసుకువచ్చిందెవరో నిజాయతీగా ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బెల్ సంస్థను బీజేపీ, టీడీపీలు తెచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. ఆ సంస్థను జిల్లాకు తేవడానికి తామెంతో కష్టపడ్డామని, ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఏదో ఘనకార్యం చేసినట్టు చంకలు గుద్దుకుంటున్నదని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన పనులను తాము చేస్తున్నట్టు ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా ఒక్క మీటరు పొడవైన రోడ్డును కూడా వేయలేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హంద్రీనీవా పనులు 95 శాతం పూర్య్యాయని, మిగిలిన 5 శాతం పనులను ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న వారికి రూ. 5 లక్షల పరిహారం పేపర్లకు మాత్రమే పరిమితమైందని, ఏ కుటుంబానికి కూడా రూ. 1.5 లక్షలకు మించి అందలేదని ఆరోపించారు.

  • Loading...

More Telugu News