: త్రిపుర గవర్నర్ గా కేసరినాథ్ కు అదనపు బాధ్యతలు
త్రిపుర గవర్నర్ గా పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి అదనపు బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ గుప్తా, కేసరీనాథ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గ సభ్యులు, పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. త్రిపుర గవర్నర్ తథాగదారాయ్ నెలపాటు సెలవు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన నవంబర్ 3వ తేదీన తిరిగి రానున్నారు. అంతవరకూ త్రిపుర గవర్నర్ బాధ్యతలను కేసరీనాథ్ తీసుకుంటారు.