: మన సంపాదనతో కోపతాపాలకు లింకుందట!


మనకొచ్చే కోపానికి, భయానికి మన సంపాదనతో లింకుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. అలాగే ట్విట్టర్లో చేసే ట్వీట్లు సంపాదన తీరును తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సుమారు 5 వేల మంది చేసిన 10 మిలియన్ల ట్వీట్లపై చేసిన అధ్యయనం ద్వారా ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఎక్కువ సంపాదించేవారు ట్వీట్లలో కోపం, భయం ప్రదర్శిస్తారని వారు తెలిపారు. సగటు జీతం కన్నా తక్కువ సంపాదించేవారు ఆశావాదంతో మాట్లాడుతారని వారు తెలిపారు. ఎక్కువ సంపాదన ఉన్నవారు రాజకీయాలు, వివిధ సంస్థలు వంటి విషయాలపై చర్చిస్తారని, తక్కువ సంపాదన ఉన్నవారు హామీ లాంటి పదాలు ఉపయోగిస్తారని పరిశోధనలో తేలింది. తక్కువ సంపాదన ఉన్నవారు ట్విట్టర్ ను వ్యక్తిగత అవసరాల కోసం వాడితే, ఎక్కువ సంపాదన ఉన్నవారు ట్విట్టర్ ను వృత్తిపరమైన అంశాల కోసం వాడారని పరిశోధన తేల్చింది.

  • Loading...

More Telugu News