: పదవీ విరమణ చేసిన కోదండరాం... ఇకపై సంపూర్ణ తెలంగాణ సాధన కోసం కృషి
ప్రొఫెసర్ కోదండరాం ఈ రోజు పదవీ విరమణ చేశారు. చివరగా ఇవాళ సికింద్రాబాద్ పీజీ కళాశాలలో విద్యార్థులకు విద్యా బోధన చేశారు. విద్యార్థులు, సహ ఆచార్యులు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, 34 ఏళ్ల అధ్యాపక వృత్తి తనకెంతో సంతృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరింత కృషి చేస్తానని చెప్పారు. పదవీ విరమణతో ఎక్కువ సమయం తెలంగాణ కోసం కేటాయించే అవకాశం కలుగుతుందన్నారు. కోదండరాం టీజేఏసీ పొలిటికల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.