: ప్రకాశం జిల్లాలో క్షుద్ర పూజలకు బాలుడు బలి
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. క్షుద్ర పూజల కోసం నాలుగేళ్ల బాలుడిని బలిచ్చారు. వలేటివారిపాలెం మండలం పోకూరులో ఈ సంఘటన జరిగింది. తిరుమలరావు అనే వ్యక్తి బాలుడి మెడ కోసి, కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక అంగన్ వాడీ కేంద్రం నుంచి బాలుడిని తీసుకెళ్లిన తిరుమలరావు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తన కొడుకు కనిపించడం లేదని తల్లి ఆరా తీయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనతో బాలుడి తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. కుటుంబీకులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.