: 'పీసీ' సీరియల్ కోసం సల్మాన్ ఉబలాటం


'పీసీ' అంటూ బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ సీరియల్ 'క్వాంటికో' కోసం స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎదురు చూస్తున్నాడు. 'పీసీ' షో భారత్ లో ఎప్పట్నుంచి ప్రసారమవుతుంది? అంటూ అభిమానులను సల్లూ భాయ్ ట్విట్టర్లో ప్రశ్నించాడు. 'పీసీ' అంటే అర్థం కాలేదేమోనని భావించి, 'పీసీ' అంటే ప్రియాంకా చోప్రా అని తెలిపాడు. కాగా, ప్రియాంకా చోప్రా నటించిన అమెరికా టీవీ షో 'క్వాంటికో' అక్టోబర్ 4 నుంచి అక్కడ ప్రసారం కానుంది. కాగా, అక్టోబర్ 11 నుంచి స్టార్ వరల్డ్ లో భారత్ లో దీనిని ప్రసారం చేస్తారు.

  • Loading...

More Telugu News