: వరంగల్ లోనూ గొలుసు దొంగతనాలు!
వరంగల్ జిల్లాలోనూ గొలుసు దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలో మూడు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. స్థానిక బ్యాంకు కాలనీలోని ఇద్దరు మహిళల మెడల్లోంచి 9 తులాల బంగారం గొలుసులను దుండగులు లాక్కుపోయారు. ఆటోనగర్ లో చోటుచేసుకున్న మరో సంఘటన లో ఒక వ్యక్తి మెడలో నుంచి బంగారం గొలుసును లాక్కెళ్లారు. దీంతో లబోదిబోమంటున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో నిన్న వేర్వేరు చోట్ల గొలుసు దొంగతనాల సంఘటనలు సుమారు 12 వరకు జరిగాయి. ఆయా సంఘటనలలో మొత్తం 40 తులాల బంగారాన్ని మహిళల మెడల్లోంచి దొంగిలించుకెళ్లారు. దీంతో రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని మహిళలు వాపోతున్నారు.