: ఏపీలో 20వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జా అయ్యాయి: మంత్రి మాణిక్యాలరావు


ఆంధ్రప్రదేశ్ లో 20వేల ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. కబ్జాదారుల వివరాలను దేవాలయాల వద్ద బోర్డులో ఉంచుతామని మంత్రి తెలిపారు. అక్టోబర్ చివరికల్లా ఈ-ప్రగతి వెబ్ సైట్ లో ఆలయ సేవలు, ఆస్తులు, ఆభరణాల వివరాలు పొందుపరుస్తామని మీడియా సమావేశంలో వివరించారు. పోలవరం నిర్మాణ పనుల తీరుపై బీజేపీ సంతృప్తితో ఉందన్నారు. పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చామని మాణిక్యాలరావు చెప్పారు. పోలవరంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News