: అసోం సీఎంకు తీవ్ర అనారోగ్యం... పరిస్థితి విషమిస్తోందంటున్న వైద్యులు


అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిన్న సాయంత్రం అసోంలోని టిన్సుకియాలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తరుణ్ గొగోయ్ ఒక్కసారిగా కుప్పకులారు. వెనువెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సమీపంలోని సర్క్యూట్ హౌస్ కు తరలించారు. అతిసారం కారణంగానే సీఎం అస్వస్థతకు గురయ్యారని వైద్యులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ఆయనకు చికిత్స అందిస్తున్న అసోం మెడికల్ కళాశాల వైద్యులు నేటి ఉదయం ఆయన ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. సీఎం ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు. 79 ఏళ్ల వయసున్న తరుణ్ గొగోయ్ 2011లో మూడుసార్లు గుండె ఆపరేషన్లు చేయించుకున్నారు.

  • Loading...

More Telugu News