: నా ఫాంహౌస్ లో అల్లం పండుతుందో, లేదో!: కేసీఆర్


తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో రైతు ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. యావత్ తెలంగాణ రైతాంగం వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. కేవలం కొద్ది ప్రాంతాలకే నీటి సదుపాయం ఉందని చెప్పారు. తన ఫాంహౌస్ లో తాను పెట్టిన అల్లం కూడా పండుతుందో? లేదో? తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. హైదరాబాదులో దేశంలో ఎక్కడా లేని విధంగా 364 విత్తన కంపెనీలు ఉన్నాయని... దేశంలోని విత్తన అవసరాలను 60 శాతం మేర ఇవి తీరుస్తున్నాయని చెప్పారు. ఓ వైపు విత్తన బాండాగారం, మరోవైపు రైతు ఆత్మహత్యలు... ఈ వైరుధ్యం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. రైతు కన్నీళ్లు తుడవాల్సిన అవసరం అందరిపై ఉందని చెప్పారు. ఈ క్రమంలో, విపక్షాలు ఇచ్చే సూచనలను తాము స్వీకరిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News