: కేసీఆర్ తిరుపతి హుండీలో వాటా అడిగారా?: హరీష్ రావు


''టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు గుంటూరులో భూమి అడిగారా? తిరుపతి హుండీలో వాటా అడిగారా? లేదే. న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, నీరు ఉద్యోగాలు అడిగారు. దానికే ఆయన మీద కేసులు పెడుతున్నారు'' అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ హైదరాబాద్ నగరబాటలో భాగంగా ఈ రోజు ఆయన సీతాఫల్ మండిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశామని చెప్పే రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళంతా ఒకనాడు చెప్పులు లేకుండా నగరానికి వచ్చిన వారేనని అన్నారు. 

  • Loading...

More Telugu News