: అమెరికా, చైనాలను వెనక్కి నెట్టిన భారత్!


ప్రపంచవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్న దేశాల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న దేశంగా ఇండియా నిలిచింది. ఈ జాబితాలో ఇటీవలి వరకూ అమెరికా, చైనాలు పోటీపడుతుండగా, 2015లో ఇండియా ఆ స్థానాన్ని ఆక్రమించుకుందని 'ఫైనాన్షియల్ టైమ్స్' దినపత్రిక ప్రకటించింది. ఈ సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఇండియాకు 31 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.05 లక్షల కోట్లు) ఎఫ్డీఐ రూపంలో రాగా, చైనా రెండవ స్థానంలో నిలిచి 28 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.68 లక్షల కోట్లు), అమెరికా 27 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.62 లక్షల కోట్లు) తమ దేశానికి రప్పించుకోగలిగాయి. గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్ మెంట్ (మూలధన వ్యయం ఆధారంగా వేసే అంచనాలు) తొలి ఆరు నెలల్లో ఇండియాను అగ్రస్థానంలో నిలిపాయని, చైనాతో పోలిస్తే 3 బిలియన్ డాలర్లు, అమెరికాతో పోలిస్తే 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇండియాకు అదనంగా వచ్చాయని 'ఫైనాన్షియల్ టైమ్స్' పేర్కొంది. 2014లో ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న ఇండియా, మోదీ తీసుకున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వం మార్చిన పలు విధానాల కారణంగా తొలి స్థానంలోకి దూసుకొచ్చిందని వివరించింది. పలు దేశాలను సందర్శిస్తున్న ప్రధాని మోదీ, 'మేకిన్ ఇండియా' అంటూ చేస్తున్న ప్రచారం విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని, దీనికితోడు పలు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధులను విస్తరిస్తూ తీసుకువచ్చిన సంస్కరణలు ఫలితాలను చూపుతున్నాయని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News