: కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడ్డారట!
తెలంగాణ శాసనమండలిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. తెలంగాణ రైతు హక్కుల పరిరక్షణ కోసం గత ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో కేసీఆర్ పాదయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు. 120 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ కూడా రైతుల కోసం కేసీఆర్ పాదయాత్ర చేశారని చెప్పారు. దీంతో, సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. 105 డిగ్రీలకు చేరితేనే ప్రాణాపాయ పరిస్థితి ఉంటుంది. అలాంటిది, కేసీఆర్ 120 డిగ్రీల జ్వరంతో బాధపడ్డారని కర్నె చెప్పారు. విషయం ఏమిటంటే, 102 డిగ్రీలు అని చెప్పబోయి, 120 డిగ్రీలు అంటూ కర్నె ప్రభాకర్ నోరు జారారు. దీంతో, సభలో ఉన్న సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే, తన మాటను ఆయన సరిదిద్దుకున్నారు.