: ఇలా కించపరుస్తారా?... ఆకాశవాణిపై ఆర్యవైశ్యుల ఆగ్రహం


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ముద్రా యోజన పథకం ప్రచారం ఆకాశవాణి మెడకు చుట్టుకుంది. హిందీలో తయారైన ప్రకటనను తెలుగులోకి తర్జుమా చేయడంలో ఆర్యవైశ్యులను అవమానపరిచారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటనలో ఓ నిరుద్యోగుడైన కుమారుడితో తండ్రి మాట్లాడుతూ "నా సంపాదనంతా ఆ కోమటోడికి వడ్డీ కట్టడానికే సరిపోయింది" అని అంటాడు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలలో ఉన్న వైశ్యులకు చేరగా, ఆర్యవైశ్య సంఘాలు మండిపడ్డాయి. వారి నుంచి వచ్చిన ఫిర్యాదుతో ప్రకటను నిలిపివేశామని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని ఆలిండియా రేడియో డిప్యూటీ డైరెక్టర్ ఎం.కృష్ణకుమారి ఓ లేఖను రాశారు. కాగా, ఈ ప్రకటన ఆర్యవైశ్యులను కించపరిచిందని, దీనికి బాధ్యులైన వారిని అరెస్ట్ చేయకుంటే ఆకాశవాణి కేంద్రాలను ముట్టడిస్తామని వైశ్య ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News