: విజయ్, సమంత, నయనతార ఇళ్లపై ఐటీ దాడులు
ప్రముఖ దక్షిణాది సినీతారల ఇళ్లపై ఈ ఉదయం అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలయ్యాయి. విజయ్, నయనతార, సమంత తదితరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. తిరువనంతపురం, కొచ్చి, చెన్నైలలోని నయనతార ఇళ్లలో ఉదయం 6 గంటల నుంచి దాడులు ప్రారంభించిన ఐటీ శాఖ అధికారులు, హైదరాబాద్, చెన్నైలలోని సమంత ఇళ్లనూ ఏకకాలంలో రైడ్ చేశారు. ఇక విజయ్ తో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లోని నటీనటుల ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.