: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ప్రకటన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కమిటీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావును నియమించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతారని వెల్లడించిన ఆయన, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించినట్టు పేర్కొన్నారు. ఈ ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు, అన్ని జిల్లాల వారికీ, వివిధ వర్గాలకూ సమాన ప్రాతినిధ్యం లభించేలా ఈ కమిటీలను రూపొందించామని వెల్లడించారు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేయాలన్నదే తమ అభిమతమని తెలియజేశారు.

  • Loading...

More Telugu News