: తెలుగుదేశం కమిటీల్లో పదవులు వీరికే
తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీల్లో అధ్యక్షుల నుంచి సభ్యుల వరకూ ఎవరెవరిని నియమిస్తున్నామన్న విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. టీడీపీకి ఒక కేంద్ర కమిటీ, రెండు రాష్ట్ర కమిటీలు ఉంటాయని వెల్లడించిన ఆయన పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్, మోత్కుపల్లి, అయ్యన్నపాత్రుడు, చినరాజప్పలు కొనసాగుతారని తెలిపారు. కేంద్ర కమిటీలో పి.రాములు, గరికపాటి, మాగుంట, డీకే సత్యప్రభ, లోకేష్, కొనకళ్ల ఉంటారని, అధికార ప్రతినిధులుగా ఎం.శ్రీనివాసరావు, పంచుమర్తి అనురాధ, లింగారెడ్డి, జూపూడి ప్రభాకర్, డొక్కా మాణిక్య వరప్రసాద్ లను నియమించినట్టు వివరించారు. మరిన్ని పదవులను ఎవరికి ఇస్తున్నామన్న పేర్లను చంద్రబాబు స్వయంగా వివరిస్తున్నారు.