: ధర్మశాల టీట్వంటీ మ్యాచ్ లో మద్యం సరఫరా లేదు


అక్టోబర్ 2న ధర్మశాలలోని హెచ్ పీసీఏ స్టేడియంలో నిర్వహించే టీట్వంటీ మ్యాచ్ లో మద్యం సరఫరా చేయడం లేదని డిప్యూటీ కమిషనర్ కంగ్రా రితేష్ తెలిపారు. ధర్మశాలలో ఆయన మాట్లాడుతూ, భారత్-సౌతాఫ్రికా మధ్య మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ అక్టోబర్ 2న ప్రారంభం కానుండగా, అదే రోజు జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. మ్యాచ్ కు వచ్చే ప్రముఖులు, అతిథులెవరికీ మద్యం సరఫరా చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు కూడా తెలిపామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News