: స్నాతకోత్సవానికి డ్రెస్ కోడ్ తో పనిలేదు: హెచ్ సీయూ వీసీ


హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్ సీయూ) స్నాతకోత్సవానికి ఇకపై డ్రెస్ కోడ్ తో పనిలేదు. ఈ విషయాన్ని వర్శీటీ వీసీ అప్పారావు వెల్లడించారు. డ్రెస్ కోడ్ కారణంగా స్నాతకోత్సవ సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. డ్రెస్ కోడ్ అనేది బ్రిటీష్ కాలం నాటిదని, ఆ సంప్రదాయానికి స్వస్తి చెబుతున్నామని ఆయన అన్నారు. భారతీయ సంస్కృతిలోనే స్నాతకోత్సవం నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. స్నాతకోత్సవం రోజున డిగ్రీ పట్టాలు స్వీకరించే విద్యార్థులు ఏ దుస్తులైనా ధరించవచ్చని అప్పారావు వివరించారు.

  • Loading...

More Telugu News