: పెళ్లి బృందంపై మిసైళ్లతో దాడి: యెమెన్ లో 131 మంది దుర్మరణం


యెమెన్ లోని ఆల్ వాహిజాలో ఒక పెళ్లి బృందంపై మిస్సైళ్లతో దాడి జరిగిన సంఘటనలో 131 మంది మరణించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధము లేదంటూ సౌదీ అరేబియా సంకీర్ణ సేనల అధికారులు ప్రకటించారు. ఇది తమ పనేనని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంతవరకూ ప్రకటించకపోవడం గమనార్హం. ఎర్రసముద్రం తీరంలో ఆల్ మోకా రేవుకు సమీపంలో ఉన్న ఆల్ వాహిజాలో నిన్న జరిగిన ఈ దారుణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా ఈ దాడిని యూఎన్ఓ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ ఖండించారు.

  • Loading...

More Telugu News