: చిన్నతనంలో ఒత్తిడికి గురైతే... ఈ వ్యాధులు వచ్చే అవకాశం


చిన్న పిల్లల జీవితం ఎంత ఆహ్లాదకరంగా ఉంటే, వారి భవిష్యత్తు అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. అందువల్ల, వారికి ఒత్తిడిలేని జీవితాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అందరిపైనా ఉంది. చిన్నతనంలో ఒత్తిడికి గురైన చిన్నారులకు తదనంతర కాలంలో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిక్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. మొత్తం 7వేల మందిపై పరిశోధనలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. 7, 11, 16, 23, 33, 42 ఏళ్ల వయసున్న వ్యక్తుల మానసిక వేదన, ఒత్తిడికి సంబంధించిన లక్షణాలను పరిశోధకులు సేకరించి, అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ప్రకారం, చిన్నతనంలో ఒత్తిడికి గురైన వారు 45 ఏళ్ల వయసు వచ్చే సరికి గుండె జబ్బులు, డయాబెటిస్ బారిన ఎక్కువగా పడుతున్నారని తేలింది. ఈ వివరాలను హార్వర్డ్ యూనివర్శిటీ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం పరిశోధకుడు అశ్లీ విన్నింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News