: మీరు నన్నేమని పిలిచినా నేను ఏం చేయగలనో అదే చేస్తా!: రఘురాం రాజన్
అంచనాలకు మించి వడ్డీ రేట్లను తగ్గించారని తనపై వస్తున్న కాంమెంట్లపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తనదైన శైలిలో స్పందించారు. "నా పేరు రఘురాం రాజన్. నేను ఏం చేయగలనో అదే చేస్తా" అని ఆయన అన్నారు. మూడేళ్ల తరువాత వడ్డీ రేట్లను ఊహించిన దానికన్నా ఎక్కువగా, ఒకేసారి అర శాతం తగ్గించడంపై కొందరు ఆయనను శాంతా క్లాజ్ (బహుమతులు పంచేవాడు)తో పోలుస్తూ వ్యాఖ్యానించడంపై ఆయన మాట్లాడారు. "మీరు నన్నేమని పిలుస్తారో నాకు తెలియదు... శాంతా క్లాజ్ ... లేక మీరు నన్ను హక్ (రాబందు) అని పిలుస్తారా? నాకు తెలీదు. అలా పిలిపించుకోవాలన్న ఉద్దేశమూ నాకు లేదు" అని ఆయన అన్నారు. స్థిరత్వంతో పాటు వృద్ధి రేటు పెరుగుదలా ముఖ్యమేనన్న ఆయన రెండింటి మధ్యా సమతుల్యం కోసమే ఈ పని చేసినట్టు తెలిపారు. దీన్ని మార్కెట్ వర్గాలకు దివాలీ బోనస్ గా భావించవద్దని చెప్పిన ఆయన, ఈలోగా మరోసారి పెట్టుబడిదారులకు ఆనందం కలిగించే నిర్ణయాలను ఆర్బీఐ తీసుకోవచ్చన్న సంకేతాలు పంపారు.