: సల్మాన్ షోకి రానున్న షారుఖ్


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో 'బిగ్ బాస్-9'కి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నాడు సల్మాన్ ఖాన్. షారుఖ్ కు ఇప్పటికే ఇన్విటేషన్ కూడా అందింది. ఈ వివరాలను స్వయంగా సల్మన్ ఖానే వెల్లడించాడు. బిగ్ బాస్-9 షోకి రావాలని షారుఖ్ ను స్వయంగా ఆహ్వానించానని... షోలో పాల్గొంటున్న పోటీదారులను కలవాలని కోరానని చెప్పాడు. తన తదుపరి చిత్రం 'దిల్ వాలే'ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఈ షో ద్వారా షారుఖ్ కు ఉంటుందని సల్మాన్ తెలిపాడు. ఈ షోకు షారుఖ్ వస్తే చాలా సరదాగా ఉంటుందని చెప్పాడు. మరోవైపు, షారుఖ్, కాజోల్ కలసి నటిస్తున్న 'దిల్ వాలే' సినిమా డిసెంబర్ 18న విడుదల కానుంది. వాస్తవానికి సల్మాన్, షారుఖ్ ఇద్దరూ మంచి స్నేహితులు. కానీ, మధ్య కాలంలో ఇద్దరి మధ్య చిన్న మనస్పర్థలు వచ్చి దూరమయ్యారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అందుకే, మిత్రులిద్దరూ మళ్లీ కలసిపోయారు.

  • Loading...

More Telugu News