: బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్... అక్టోబర్ 4న కొత్త అధ్యక్షుడి ఎన్నిక
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియామకం కానున్నారు. ఈ మేరకు అక్టోబర్ 4న ముంబైలో బీసీసీఐ ప్రత్యేక జనరల్ మీటింగ్ జరగనుంది. ఆ సమావేశంలోనే బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా శశాంక్ ను ఎన్నుకుని, అదే రోజు అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఇటీవల జగన్మోహన్ దాల్మియా చనిపోవడంతో 15 రోజుల్లో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంది. దాంతో గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి ఆయన బీసీసీఐ పగ్గాలు చేపట్టబోతున్నారు. నాగపూర్ న్యాయవాది అయిన శశాంక్... విదర్భ క్రికెట్ అసోసియేషన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.