: టీఎస్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం... ఎంఐఎం వాయిదా తీర్మానం తిరస్కరణ
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెంటనే, వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పై చర్చించాలని ఎంఐఎం వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, రైతు సమస్యలపైనే చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రైతు సమస్యలు, రుణమాఫీ అంశాలపై చర్చించాలని నిర్ణయించామని చెప్పారు. రెండు రోజులపాటు రైతు సమస్యలపైనే చర్చిద్దామని సూచించారు. బీఏసీ నిర్ణయం ప్రకారమే చర్చ జరుపుదామని మంత్రి హరీష్ రావు తెలిపారు.