: అంగారకుడిపై నీరు... సంచలన విషయాన్ని వెల్లడించిన నాసా


అంగారక గ్రహం (మార్స్) పై ఉప్పు నీటి నిల్వలున్నాయని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. మార్స్ ఎక్స్ ప్లొరేషన్ లో భాగంగా ఈ విషయాన్ని తెలుసుకున్నామని లీడ్‌ సైంటిస్ట్ మైఖేల్‌ మేయర్‌ ప్రకటించారు. ఈ నీరు ప్రవహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న నీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నట్టు తేలిందన్నారు. పలు చోట్ల నీరు ఉన్న కారణంగా జీవం ఉండేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు భావిస్తున్నామని వివరించారు. నాసా విడుదల చేసిన ఛాయా చిత్రాల ప్రకారం అంగారక గ్రహంలోని నీరు చిక్కగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మార్స్ పై నీటి జాడలను కనుగొన్నామని గతంలోనే భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇండియా వద్ద అత్యాధునిక సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలను చూపలేకపోయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని నాసా సాక్ష్యాలతో చూపడం గమనార్హం.

  • Loading...

More Telugu News