: నిమజ్జన కార్యక్రమంలో ఇచ్చిన జ్యూస్ తాగిన 36 మందికి అస్వస్థత


ముంబై లో వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన జ్యూస్ తాగడంతో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. ముంబై సబర్బన్ జోగేశ్వరీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి బాధితులను తరలించారు. వైద్యసేవలు కొనసాగుతున్నాయి. అయితే, జ్యూస్ బాధితులలో 17 మందిని డిశ్చార్జ్ చేశారు. మిగతా వారికి వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, ఈ సంఘటనపై నిమజ్జన నిర్వాహకులు మాట్లాడుతూ, జ్యూస్ తయారు చేసేటప్పుడు జాగ్రత్తగానే ఉన్నామని, ఎందుకు ఇలా జరిగిందో తమకు తెలియడం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News