: నన్ను అంతం చేయడానికే రాళ్ల దాడి: ఎర్రబెల్లి
తనను అంతం చేయడానికే టీఆర్ఎస్ తనపై రాళ్లదాడి చేసిందని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. జనగామలో ఎర్రబెల్లి పర్యటించిన సందర్భంగా టీడీపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడుల్లో గాయపడిన మీడియా ప్రతినిధులను ఆయన పరామర్శించిన సందర్భంలో వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్ని కుట్రలు చేసినా రేపు అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపిస్తానని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని ఎర్రబెల్లి తెలిపారు. ఇలాంటి దాడులు తమ పోరాటాన్ని మరింత పటిష్ఠం చేస్తాయని ఆయన వివరించారు.