: పాలకుర్తి ఘటనపై మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తాం: ఎర్రబెల్లి


పాలకుర్తి ఘటనపై మానవహక్కుల కమిషన్, హైకోర్టులకు వెళతామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. పాలకుర్తి ఘటనలో గాయపడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఈరోజు ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు స్వీకరించటం లేదని, వారు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందుకే మానవహక్కుల కమిషన్ ను, హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News