: అమరావతి శంకుస్థాపన రోజు రాష్ట్ర పండుగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే రోజును రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు శంకుస్థాపన రోజు పండుగ అంటూ జీవో కూడా విడుదల చేసింది. కాగా, అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ముంబైకి చెందిన ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు 9.50 కోట్ల రూపాయలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.